పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

బేతాళ ప్రశ్న-3. ఎవరిని పెళ్లి చేసుకోవాలి?

చిత్రం
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! అవంతిపురం రాజ్యాన్ని ఖాండిక్యుడు అనే రాజు పాలించేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె, ఆమె పేరు పద్మావతి. ఆమె అపురూప సౌందర్యవతి. పద్మావతి కి పెళ్లి వయసు రాగానే ఖాండిక్యుడు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకుగాను చుట్టు పక్కల  ఉన్న అన్ని రాజ్యాలలోని రాజకుమారులకు సందేశం పంపించాడు. పద్మావతి అతి రూప సౌందర్యవతి అని తెలుసుకుని ఎంతోమంది రాజ కుమారులు పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకొన్నారు.  ఖాండిక్యుడు పంపిన పద్మావతి స్వయంవరానికి ఎంతోమంది రాజకుమారులు విచ్చేస్తున్నారు. కానీ వచ్చిన రాజకుమారులందరూ వెనక్కి వెళ్ళి పోతున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన ముగ్గురు రాకుమారులు ఎందుకు అందరూ వెనక్కి వెళ్లిపోతున్నారని, అర్థం కాక,వెళ్ళిపోతున్న రాజకుమారుని అడిగార