పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?

చిత్రం
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! రంగయ్య, గంగమ్మ అనే దంపతులు అడవిలో నివాసం ఉండేవారు. రంగయ్య ఒక వేటగాడు. అతను రోజు వేటకు వెళ్లి తినడానికి ఏదో ఒకటి తీసుకువచ్చేవాడు. రంగయ్య , గంగమ్మ లకు నలుగురు కొడుకులు పుట్టారు. ఆ నలుగురు కొడుకులను రంగయ్య, గంగమ్మ లు ఎంతో అపురూపంగా పెంచసాగారు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత  కొడుకులు నలుగురు యుక్త వయస్సుకు వచ్చారు. ఇలా  ఎంతో ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో, ఒక రోజు గంగమ్మ నీరు తీసుకురావడానికి నది వద్దకు వెళితే అక్కడ పొంచి ఉన్న ఒక పెద్ద పులి ఆమెను అక్కడే చంపి తినేసింది. ఇది తెలుసుకున్న గంగయ్య నా భార్యను చంపిన పులిని నేను చంపుతానని వెళ్లి పులిని చంపి, తను కూడా బలైపోయాడు. ఇప్పుడు ఆ నలుగురు కొడుకులు తల్లిదండ్రులు లేని అనాధలు అయ్యారు. వారికి అడ