పోస్ట్‌లు

జులై, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవరిని పెళ్లి చేసుకోవాలి? బేతాళ ప్రశ్న 7?

చిత్రం
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! కలింగదేశాన్ని నిరంకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది అతను అదే కోరికని తన జీవితాశయం గా పెట్టుకొని పెరిగి పెద్దవాడయ్యాడు. అనుకున్నట్టుగానే నిరంకుడికి పెళ్లి వయసు రాగానే తన తల్లిదండ్రులు యువరాణి కోసం వెతకసాగారు. ఇలా వెతుకుతున్నా తన తల్లిదండ్రులకు నిరంకుశుడు ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతని తీసుకువస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. నిరంకుడి తల్లిదండ్రులు అందరికంటే అందమైన యువతిని తీసుకొచ్చిన వారికి ఒక గదినిండా బంగారు నాణాలు ఇస్తానని తన దేశంలో దండోరా వేయిస్తాడు అలాగే ఇతర దేశాలకు కూడా వర్తమానం పంపిస్తాడు. ఇలా దండోరా వేయించిన క

బేతాళ ప్రశ్న6? ఎవరు కారణం?

చిత్రం
  విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! పార్వతీపురం అనే రాజ్యాన్ని నీలుడు అనే రాజు పాలించేవాడు. అతడు తన ప్రజలను ఎంతో  ప్రేమతో చూసుకునేవాడు. పార్వతిపురంలో ఎప్పుడూ సిరిసంపదలు వెలుగుతూ ఉండేది. పక్క  రాజ్యంలో ఉన్న ప్రజలంతా పార్వతీపురంలో నివసించడానికి ఇష్టపడేవారు ఇది తెలిసి  ఆ దేశ రాజులు పార్వతీపురం చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసేవారు. కానీ  పక్క దేశ రాజులకు అది సాధ్యం కాలేదు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఎన్నో రాజ్యాలు గెలిచిన ప్రతీపుడు అనే రాజు ఇప్పుడు పార్వతీపురాన్ని గెలవడానికి దండెత్తి వచ్చాడు. నీలుడు సైన్యానికి, ప్రతీపుడు సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు విడిచారు, యుద్ధం పోటాపోటీగా జరిగినా చివరికి ప్రతీపుడు యుద్ధంలో గెలిచాడు. ప్రతీపుడ