బేతాళ ప్రశ్న6? ఎవరు కారణం?


 

విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో!


పార్వతీపురం అనే రాజ్యాన్ని నీలుడు అనే రాజు పాలించేవాడు. అతడు తన ప్రజలను ఎంతో  ప్రేమతో చూసుకునేవాడు. పార్వతిపురంలో ఎప్పుడూ సిరిసంపదలు వెలుగుతూ ఉండేది. పక్క  రాజ్యంలో ఉన్న ప్రజలంతా పార్వతీపురంలో నివసించడానికి ఇష్టపడేవారు ఇది తెలిసి  ఆ దేశ రాజులు పార్వతీపురం చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసేవారు. కానీ  పక్క దేశ రాజులకు అది సాధ్యం కాలేదు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఎన్నో రాజ్యాలు గెలిచిన ప్రతీపుడు అనే రాజు ఇప్పుడు పార్వతీపురాన్ని గెలవడానికి దండెత్తి వచ్చాడు. నీలుడు సైన్యానికి, ప్రతీపుడు సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు విడిచారు, యుద్ధం పోటాపోటీగా జరిగినా చివరికి ప్రతీపుడు యుద్ధంలో గెలిచాడు. ప్రతీపుడు, నీలుడు మంచి గుణానికి మెచ్చి అతడిని చంపకుండా పార్వతీపురం  నుంచి పంపించి వేశాడు.

   ఇలా పార్వతీపురం నుండి వచ్చిన నీలుడు తన జీవితం మీద విరక్తి చెంది, కాశీకి వెళ్లి శివుని దర్శనం చేసుకుని అక్కడే మరణించాలని నిర్ణయించుకొని ప్రయాణం అయ్యాడు. ఇలా నీలుడు నెలరోజుల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. దారిలో దొరికిన  ఫలాలు తిని, దొరికిన నీటిని తాగి ఎంతో కష్టంతో ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు. ఇలాగే ప్రయాణం సాగిస్తూ నీలుడు ఒక బిచ్చగాని వలె తయారయ్యాడు. కాశీకి దగ్గరవుతున్నకొద్దీ అతని శరీరం లోని శక్తి మొత్తం తగ్గిపోతుంది. నీలుడు తన కడుపు నిండా ఆహారం తిని ఇప్పటికీ నెల రోజులు పైనే అయింది. ఏదైనా ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్లి బిచ్చం అడిగి తన కడుపు నింపుపోవాలని అనుకుంటూ వెళుతున్నాడు. ఇలా అనుకుంటూ వెళుతున్నా అతనికి తన కనుచూపు మేరలో ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఎంతో సంతోషంతో పూరి గుడిసె దగ్గరికి వేగంగా నడవసాగాడు.

   పూరి గుడిసె దగ్గరికి చేరుకొని నీలుడు ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. పూరిగుడిసెలో నుంచి ఒక పెద్దావిడ ఎవరు కావాలి? అంటూ బయటకు వచ్చింది. నీలుడు ఆమెని  "తల్లి నాకు ఆకలి వేస్తుంది, అన్నం తిని నెల రోజులు పైనే అవుతుంది తమరి దగ్గర ఏదైనా ఉంటే నాకు పెట్టండి అని ప్రాధేయపడ్డాడు."ఈ మాటలు విన్న పెద్దావిడ మనస్సు చెలించి, ఇంట్లోకి వెళ్లి తినడానికి అన్నం పళ్లెంలో పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ భోజనం   నీలుడి చేతికిచ్చింది, నీలుడు వెంటనే తనకు దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుని భోజనం తింటూ ఉన్నాడు. అదే చెట్టుపైన ఒక గ్రద్ద ఒక పాము ని పట్టుకొని దానిని చంపి తినాలని ఇప్పుడే ఆ చెట్టు పైకి వచ్చింది.  ఆ గ్రద్ద  పాముని చంపుతుంటే ఆ పాము ఏమీ చేయలేక తన నోట్లో ఉన్న విషాన్ని బయటకు చిమ్ముతూ  అక్కడికక్కడే చనిపోయింది.ఆ విషం భోజనం లో పడి నీలుడు  తింటుండగానే మరణించాడు.

కథ విన్నారు కదా స్నేహితులారా! ఇప్పుడు చెప్పండి నీలుడి మరణానికి కారణం? ఎవరు సమాధానం తెలిసీ చెప్పకపోతేే మీకు ఇష్టమైన కూర మీరు తినకుండానే మొత్తం అయిపోతుంది.




బేతాళ ప్రశ్న5? కి సమాధానం:ఈ కథలో నలుగురన్నదమ్ములు తప్పు చేశారు ఆ తప్పు ఏమిటంటే,

* ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం 

కానీ వారు చనిపోవడానికి కారణం మాత్రం ఒకరే , పెద్ద వాడే ఆ నలుగురి చావుకి కారణం. ఎందుకంటే చిన్న వాడు ఎముక తీసుకొని అస్తిపంజరం తయారు చేశాడు. అతని వల్ల ఆ పులి ప్రాణం తిరిగి రాదు, రెండో వాడు దానికి రక్తమాంసాలు ఇచ్చాడు. అతని వల్ల కూడా ఆ పులి బ్రతికి రాదు, ఇక మూడో వాడు ఆ పులి కి అవయవాలు అమర్చాడు. అందువల్ల కూడా ఆ పులి బ్రతికి రాదు.కానీ చివరి వాడికి అది పులి అని తెలుసు, అది బతికి వస్తే అందరిని చంపుతుంది అని కూడా తెలుసు.అయినా అతడు తన శక్తిని నిరూపించుకోవడానికి ఆ పులికి ప్రాణం పోసాడు. అందువల్లే ఆ నలుగురు చనిపోయారు.


గమనిక: ఈ కథలకు నేను చెప్పే సమాధానమే సరైన సమాధానం అవుతుంది అని కచ్చితంగా చెప్పలేను. మీరు అనుకున్న సమాధానానికి వివరణ ఉంటే అది కూడా సరైన సమాధానమే అవుతుంది.




అసలు ఈ విక్రమార్కుడి కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే!

Yes అని కామెంట్ చేయండి.

మీ సమాధానాలు కామెంట్స్ రూపంలో తెలపండి.


















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?