ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?



విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో!



రంగయ్య, గంగమ్మ అనే దంపతులు అడవిలో నివాసం ఉండేవారు. రంగయ్య ఒక వేటగాడు. అతను రోజు వేటకు వెళ్లి తినడానికి ఏదో ఒకటి తీసుకువచ్చేవాడు. రంగయ్య , గంగమ్మ లకు నలుగురు కొడుకులు పుట్టారు. ఆ నలుగురు కొడుకులను రంగయ్య, గంగమ్మ లు ఎంతో అపురూపంగా పెంచసాగారు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత  కొడుకులు నలుగురు యుక్త వయస్సుకు వచ్చారు. ఇలా  ఎంతో ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో, ఒక రోజు గంగమ్మ నీరు తీసుకురావడానికి నది వద్దకు వెళితే అక్కడ పొంచి ఉన్న ఒక పెద్ద పులి ఆమెను అక్కడే చంపి తినేసింది. ఇది తెలుసుకున్న గంగయ్య నా భార్యను చంపిన పులిని నేను చంపుతానని వెళ్లి పులిని చంపి, తను కూడా బలైపోయాడు. ఇప్పుడు ఆ నలుగురు కొడుకులు తల్లిదండ్రులు లేని అనాధలు అయ్యారు. వారికి అడవిలో ఎలా బతకాలో ఇంకా వారి తండ్రి నేర్పించలేదు. ఆ నలుగురు  ఈ ఆడవిలో బ్రతకడం మనకి చేతకాదు కనుక మనం ఏదైనా గ్రామానికి వెళ్లి ఏదో ఒక పని చేసుకొని మన పొట్ట పోసుకుని బ్రతుకుదాం అనుకుంటారు. అనుకున్న ప్రకారమే ఆ నలుగురు  అడవి నుంచి తూర్పుదిక్కు వైపు నడిచి వెళుతూ ఉంటారు. ఇలా కొన్ని గంటల నడవగా వారికి నాలుగు దారులు  కలిసిన కూడలి కనిపిస్తుంది. పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద నలుగురు  కూర్చొని మనం ఇప్పుడు ఏ దారిగుండా వెళదామని చర్చించుకుంటారు.



చివరకు నలుగురు యువకులు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు, కానీ  సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్థలానికి ఎంతో కొంత ధనం సంపాదించుకుని రావాలని  నియమం పెట్టుకుంటారు. అనుకున్న ప్రకారమే నలుగురు యువకులు 4 రకాల దారుల్లో వెళ్లి పోతారు.

 సరిగ్గా అయిదు సంవత్సరాల తర్వాత ఆ నలుగురు యువకులు ఒక్కొక్కరుగా మధ్యాహ్న కాలానికి అందరూ అక్కడికి చేరుకుంటారు.  చేరుకున్న అన్నదమ్ములు నలుగురు  ఒకరిని ఒకరు కుశలప్రశ్నలు వేసుకుంటారు. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అందరి కంటే పెద్దవాడు అందరికంటే చిన్నవాడిని, నీవు ఎంత ధనం సంపాదించుకుని వచ్చావని? అడుగుతాడు. దానికి సమాధానంగా చిన్నవాడు నేను ధనం సంపాదించుకొని రాలేదని నేను ఒక విద్య నేర్చుకోనివచ్చానని.  ఆ విద్య ఏమిటంటే తనకి ఏదైనా ఒక ఎముక దొరికితే దాని ద్వారా ఆ జీవి యొక్క పూర్తి ఎముకల గూడును (అస్తిపంజరం) సృష్టించగలనని చెబుతాడు.

  పెద్దవాడు రెండో వాడిని ఇదే ప్రశ్న అడిగితే రెండవ వాడు కూడా తాను ఎటువంటి ధనం సంపాదించుకుని రాలేదని, తను కూడా ఒక విద్య నేర్చుకుని వచ్చానని,  ఆ విద్య ఏమిటంటే  ఏ జీవికైనా సరే రక్త, మాంసములు సృష్టించగల  విద్య తనకు తెలుసునని చెబుతాడు.

  ఇలాగే పెద్దవాడు మూడవ వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగితే అతను కూడా ఇంతకాలం ఒక విద్యను అభ్యసించానని, అదేమిటంటే ఎటువంటి జీవికైనా దాని శరీరంలో ఉండే అన్ని అవయవాలను (గుండె, కాలేయం, ఊపిరితిత్తులు  మొదలగునవి) సృష్టించ కలిగే  విద్య తనకు తెలుసునని చెబుతాడు.

పెద్ద వాడు కూడా మిగిలిన వారిలాగానే ధనం  సంపాదించుకుండ చనిపోయిన శవాన్ని కైనా ప్రాణం పోసే  విద్యను నేర్చుకుని వచ్చానని మిగిలిన ముగ్గురికీ చెబుతాడు.

ఇలా నలుగురు అన్నదమ్ములు ధనం సంపాదించకుండా నలుగురు నాలుగు విద్యలు నేర్చుకుని వచ్చారు. సరిగ్గా మనం ఆలోచిస్తే, ఈ నాలుగు విద్యల ద్వారా ఏదైనా జీవిని బ్రతికించవచ్చో లేదో పరీక్షిద్దం అనుకున్నారు. ఎముక దొరికితే ఆ జీవిని బ్రతికించి తిరిగి తీసుకు రాగల శక్తి ఆ నలుగురికి ఉందని వారి నేర్చుకున్న విద్యల ద్వారా తెలుసుకున్నారు. ఆ నలుగురు వ్యక్తులు ఏదైనా ధనవంతుల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని బ్రతికించి, అలా బ్రతికించినందుకు  ఆ ధనవంతుల దగ్గర ఎంతో కొంత ధనం తీసుకుందామని చర్చించుకుంటారు. ఆ నలుగురు యువకులు నేర్చుకున్న విద్యను పూర్తిగా నేర్చుకున్నారో లేదో అనే అనుమానం  కలుగుతుంది. కనుక ఆ నలుగురు   యువకులు ముందుగా ఏదైనా  ఎముకను తీసుకొని ఆ  ఎముక కల్గిన జీవిని బ్రతికించగలమో  లేదో అని తెలుసుకోవాలనుకుంటారు. ఇలాగే చర్చించుకుంటూ ఉండగా వారికి ఒక ఆలోచన వస్తుంది అదేమిటంటే వారి తండ్రిని మళ్లీ తిరిగి తీసుకురావాలనుకుంటారు. అనుకున్న ప్రకారమే తన తండ్రి చనిపోయిన ప్రదేశానికి వెళ్లి తన తండ్రి యొక్క ఎముక కోసం వెతుకుతూ ఉంటారు. వెతకగా వెతకగా వారికి ఒక ఎముక దొరుకుతుంది. అది తన తండ్రిదో, ఎవరిదో తెలుసుకోవాలని, ఎముక  కలిగిన జీవిని బ్రతికించాలని నిర్ణయించుకుంటారు.

ముందుగా అందరికంటే చిన్నవాడు  ఆ ఎముక ద్వారా అస్తిపంజరం తయారు చేస్తాడు, రెండో వాడు ఆస్తి పంజరానికి రక్తమాంసాలు సృష్టిస్తాడు. యధావిధిగా మూడోవాడు ఆ జీవి యొక్క ఇతర అవయవాలను  అమర్చాడు. చివరిగా నాలుగో వాడు ఆ జీవికి ప్రాణం పోస్తాడు. వారు ప్రాణం పోసింది ఒక పెద్ద పులికి, ప్రాణంతో బతికిన ఆ పులి ఆ నలుగురిని చంపి తిని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.


కథ విన్నారు కదా! మిత్రులారా ఇప్పుడు చెప్పండి,  ఎవరు  చేసిన తప్పు వల్ల ఆ నలుగురు యువకులు మరణించారు? సమాధానం తెలిసి చెప్పలేదో........ ఈరోజు రాత్రి మీరు నిద్ర పోతున్నప్పుడు మీ కలలోకి పెద్దపులి వస్తుంది. ఇదే నా శాపం.


ఇటువంటి కథల కోసం వెంటనే నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.   Telugu stories

Think big

https://t.me/thinkyourway







.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid