ఎవరిని పెళ్లి చేసుకోవాలి? బేతాళ ప్రశ్న 7?



విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో!


కలింగదేశాన్ని నిరంకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండేది అతను అదే కోరికని తన జీవితాశయం గా పెట్టుకొని పెరిగి పెద్దవాడయ్యాడు. అనుకున్నట్టుగానే నిరంకుడికి పెళ్లి వయసు రాగానే తన తల్లిదండ్రులు యువరాణి కోసం వెతకసాగారు. ఇలా వెతుకుతున్నా తన తల్లిదండ్రులకు నిరంకుశుడు ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన యువతని తీసుకువస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. నిరంకుడి తల్లిదండ్రులు అందరికంటే అందమైన యువతిని తీసుకొచ్చిన వారికి ఒక గదినిండా బంగారు నాణాలు ఇస్తానని తన దేశంలో దండోరా వేయిస్తాడు అలాగే ఇతర దేశాలకు కూడా వర్తమానం పంపిస్తాడు. ఇలా దండోరా వేయించిన కొన్ని రోజుల తర్వాత ఎంతోమంది యువతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కళింగ దేశానికి విచ్చేస్తారు. వచ్చిన యువతులను అందరిని నిరంకుడి ముందు ప్రవేశపెట్టగా, నిరంకుడు తన ముందుకు వచ్చిన ప్రతి యువతిలో ఏదో ఒక చిన్న లోపం ఉండటం కారణంగా ఆ యువతులను తిరస్కరించడం జరుగుతుంది. ఇలా కొన్ని రోజుల పాటు ఎంతో మంది యువతులు కళింగ దేశానికి విచ్చేసి, నిరంకుడి ముందు నిలబడి, నిరంకుడిచేత తిరస్కరించబడి తిరిగి ఇంటికి వెళ్తున్నారు.


నిరంకుడి కోరిక నెరవేరుతుందో లేదో అని తన తల్లిదండ్రులకు భయం ఏర్పడింది. తన కొడుకు కోరుకున్న యువతి అసలు ఉందో లేదో అనే అనుమానం కూడా మొదలైంది. చివరిసారిగా తన కొడుకుకి నచ్చిన అమ్మాయిని తీసుకు వచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని దండోరా వేయిస్తాడు. ఇలా దండోరా వేయించిన మూడు రోజుల తర్వాత ఒక వ్యక్తి రాజ్య సభకు వచ్చి తన ముగ్గురు చెల్లెళ్లు ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన వారని చెప్తాడు. కానీ వారిని ఈ రాజ్యసభకు తీసుకు రావడం కుదరదని, వారిని తీసుకు వస్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా వారి అందాన్ని చూసి మూర్చపోతారని కనుక నిరంకుడినే తన ఇంటికి రావాలని చెప్తాడు. నిరంకుడు సరే అని చెప్పి ఆ వచ్చిన వ్యక్తి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి తన ముగ్గురు చెల్లెళ్లును నిరంకుడికి ఒక్కటే ఒక్కొక్కరిని, ఒక్కొక్క సారిగా చూపిస్తాడు. ఆ ముగ్గురు యువతులను చూసిన నిరంకుడు నిశ్చేష్టుడైపోతాడు. ఒకరిని మించిన అందం మరొకరిది ఇలా ముగ్గురిని చూసిన నిరంకుడు అక్కడే బొమ్మ వలె నిలబడిపోతాడు. 


కొద్దిసేపటి తర్వాత తేరుకున్న నిరంకుడు‌ ఆ ముగ్గురిలో ఎవరు అత్యంత అందంగా ఉన్నారో తేల్చుకోలేకపోతాడు. అతని కంటికి ఆ ముగ్గురు అతిలోక సుందరుల వలే కనిపిస్తారు. ఆ ముగ్గురు యువతులు అన్న నిరంకుడికి తన చెల్లెళ్ళ గురించి ఈ విధంగా వివరిస్తాడు.


అందరి కంటే పెద్దదాని పేరు పద్మావతి, పద్మావతి పువ్వు తగిలిన తన చర్మం కంది పోతుంది. రెండవ దాని పేరు ఇందుమతి, ఇందుమతికి సూర్యరశ్మి తగిలిన తన చర్మం కాలిపోతుంది. అలాగే చివర దాని పేరు సుమతి,సుమతికి చిన్న పిల్లల ఏడుపు వినిపించినా స్పృహతప్పి పడిపోతుంది.

ఆ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిరంకుడికి అర్థంకాలేదు. ముగ్గురు అందంగానే ఉన్నారు, ఇలా తనలో తాను ఆలోచించుకుంటూ ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు.తన తండ్రి మంత్రిని పంపించి ఆ ముగ్గురిలో ఎవరు అందమైన వారో తెలుసుకొని రమ్మంటాడు. అలా మంత్రి చెప్పిన వారిని తన కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తానని ఆ ముగ్గురు చెల్లెళ్లు అన్నకి మాటఇస్తాడు.


కథ విన్నారు కదా స్నేహితులారా! ఇప్పుడు చెప్పండి ఆ మంత్రి మీరు అయితే ఆ ముగ్గురు అక్క చెల్లెల్లలో ఎవరిని నిరంకుడికిచ్చి వివాహం జరిపిస్తారు. సమాధాానం తెలిసీ చెప్పకపోతే హ హ హ!

బేతాళ ప్రశ్న6? కి సమాధానం: ఈ కథ రాజుల కాలం నాటి కథ అంటే మన భారతదేశం యొక్క పూర్వం చెప్పబడిన కథ. కనుక దీనికి భారతదేశం యొక్క సాంప్రదాయం ఖచ్చితంగా ఆచరించవలసిన అవసరం ఉంది. మన భారతదేశ సంప్రదాయం ప్రకారం మన ఇంటికి వచ్చిన అతిథిని ఇంట్లోకి తీసుకువెళ్లి అతనికి అన్నం పెట్టడం కూడా ఒకటి. అప్పటి కాలంలో బిచ్చగాడిని ఒక సాధువు వలె భావించేవారు. ఒక సాధువు మన ఇంటికి వస్తే అతనికి అన్ని సపర్యలు చేసి భోజనం పెట్టి పంపిస్తాము. కానీ ఆ పెద్దావిడ నీలుడికి భోజనం పెట్టింది కానీ ఇంట్లోకి తీసుకు వెళ్ళలేదుకనుక అతని చావుకి ఆ పెద్దావిడే కారణం. 

ఈ సమాధానం నేటి కాలంలో సరైన సమాధానం కాకపోవచ్చు.కనుక అతని చావుకి విధి (తలరాత) కారణం కూడా సమాధానం అవుతుంది.


మిత్రులారా! ఇటువంటి కథల కోసం వెంటనే నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

@thinkyourway


మీకు ఈ బేతాళ కథలు ఎక్కడ మొదలయ్యాయో తెలుసుకోవాలనుకుంటే yes అని కామెంట్లో పెట్టండి.








































































కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?