బేతాళ ప్రశ్న-3. ఎవరిని పెళ్లి చేసుకోవాలి?


విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవం లో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో!


అవంతిపురం రాజ్యాన్ని ఖాండిక్యుడు అనే రాజు పాలించేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె, ఆమె పేరు పద్మావతి. ఆమె అపురూప సౌందర్యవతి. పద్మావతి కి పెళ్లి వయసు రాగానే ఖాండిక్యుడు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకుగాను చుట్టు పక్కల  ఉన్న అన్ని రాజ్యాలలోని రాజకుమారులకు సందేశం పంపించాడు. పద్మావతి అతి రూప సౌందర్యవతి అని తెలుసుకుని ఎంతోమంది రాజ కుమారులు పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకొన్నారు.  ఖాండిక్యుడు పంపిన పద్మావతి స్వయంవరానికి ఎంతోమంది రాజకుమారులు విచ్చేస్తున్నారు. కానీ వచ్చిన రాజకుమారులందరూ వెనక్కి వెళ్ళి పోతున్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన ముగ్గురు రాకుమారులు ఎందుకు అందరూ వెనక్కి వెళ్లిపోతున్నారని, అర్థం కాక,వెళ్ళిపోతున్న రాజకుమారుని అడిగారు. ఆ రాజకుమారుడు, ఖాండిక్యుడు యొక్క కూతురు పద్మావతిని ఎవరో రాక్షసుడు రాత్రి  తీసుకు వెళ్లాడని చెప్పాడు. ఆ రాక్షసుడు ఎంతో భయంకరంగాను, ఎన్నో అతీత శక్తులు కలవని కూడా చెప్పాడు. ఆ రాక్షసుడిని కనిపెట్టి అతని దగ్గరకు వెళ్ళి అతడిని చంపి తన కూతురిని తీసుకొచ్చిన వారికి అర్థ రాజ్యం తో పాటు తన కూతురిని ఇస్తానని చాటింపు  వేయించారని, రాకుమారుడు అడిగిన ముగ్గురు రాజకుమారులకు వివరిస్తాడు. అతడిని కనిపెట్టి,అతని దగ్గరికి వెళ్లి , వాడిని చంపి రాజకుమార్తె ను తీసుకురావడం ఎంతో కష్టమైన పని అని  తెలిసి మేము వెళ్లి పోతున్నామని చెప్పి ఆ రాకుమారుడు వెళ్ళిపోతాడు. ఇది విన్న ఆ ముగ్గురు రాకుమారులు, రాజు ఉన్న మందిరానికి వెళ్లి ,రాజా మేము మీ కుమార్తెను తిరిగి తీసుకువస్తామని చెప్తారు. 



ఆ ముగ్గురు రాకుమారులలో ఒక రాకుమారుడు తనకి చిత్రపటం చూపిస్తే తను ప్రస్తుతం ఎక్కడ ఉందో చెప్పగలను అని అంటాడు. రాజు వెంటనే తన దగ్గర ఉన్న పద్మావతి చిత్రపటం అతనికి చూపిస్తాడు. అతను పద్మావతి ఎక్కడ ఉందో కనిపెడతాడు ఆమె ఇక్కడికి 1000 క్రోసుల దూరంలో ఉన్న రాతితో చేయబడ్డ బందిఖానాలో బందీగా ఉంది అని చెప్తాడు.ఇది విన్న వెంటనే రాజు మనం ఇప్పుడు వెయ్యి క్రోసుల దూరం ప్రయాణించాలంటే కనీసం పది రోజులైనా సమయం పడుతుంది.మనం అక్కడికి వెళ్లేసరికి రాకుమార్తెను  ఆ రాక్షసుడు బతకనిస్తాడో లేదో అని బాధపడుతుంటే, ఆ ముగ్గురు రాకుమారులలో  రెండో వాడు తన దగ్గర ఒక గొప్ప వాహనం ఉందని అది  ఎంతదూరమైనా నిమిషాల్లో చేరిపోతుందని చెప్పాడు. ఇది విన్న వెంటనే రాజు ఎంతో సంతోషపడతాడు, కానీ మనం పద్మావతిని ఆ రాక్షసుడినుంచి ఎలా కాపాడగలము, వాడు ఎంతో     శక్తిమంతుడు, స్థూలకాయుడు, బలవంతుడు.దీనికి మూడవ రాకుమారుడు తను ఎంతో ధైర్యం గల వీరుడనని మరియు ఆ రాక్షసుడిని ఎదిరించ గలిగే శక్తి తనకు ఉందని, తనకు ఆ వాహనం ఇస్తే రాకుమార్తెను తీసుకువస్తానని అని చెప్తాడు.

ఇచ్చిన మాట ప్రకారమే మూడవ రాకుమారుడు ఆ వాహనంలో రాక్షసుడు నివసిస్తున్న స్థలానికి వెళ్లి, అక్కడ ఉన్న రాక్షసుడితో యుద్ధం చేసి, అతడిని సంహరించి,రాకుమార్తెను తీసుకువచ్చి తన తండ్రికి అప్పగిస్తాడు.ఇప్పుడు ఆ రాజకుమారులు ముగ్గురు పద్మావతిని తనకిచ్చి పెళ్ళి చేయాలి అంటే తనకు పెళ్లి చేయాలంటూ ఒకరితో ఒకరు వాదులాడుకున్నరు.ఇది చూసిన రాజుకు ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు.

విక్రమార్క విన్నావు కదా ఈ కథ, ఈ కథలో ఖాండిక్యుడు తన కూతురిని ఆ ముగ్గురు రాకుమారులో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడం ఉత్తమం.ఒకరేమో తన కూతురి  జాడ తెలిపిన వారు రెండోవారు తన కూతురి దగ్గరికి తీసుకు పోయిన వారు ,మూడు వారు తన కూతురిని రక్షించి తీసుకు వచ్చిన వారు. మొదటి వారు లేకుంటే తన కూతురిని కనిపెట్టే వారో లేదో ,రెండవ వారు లేకుంటే తన కూతురు దగ్గర చేరుకొనే లోపల ఆ రాక్షసుడు తన కూతురిని బతకనిసస్తాడో లేదో, అలాగే మూడో వారు లేకుంటే తన కూతురుని కాపాడి తీసుకు వస్తారో లేదో, సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది తెలుసు కదా!


కథ విన్నారు కదా మిత్రులారా మీకేమనిపిస్తుంది రాజుకి ఎవరు ఉత్తమ అల్లుడు అవుతారు, ఎందుకో వివరంగా కామెంట్ లో తెలపండి.





 బేతాళ ప్రశ్న 2   సమయంఎంత?   

సమాధానం: ముందుగా నకులసహదేవులు ఆ స్వరంగ మార్గం గుండా అవతల వైపుకు వెళ్ళి(5),వారి ఇద్దరిలో ఎవరో ఒకరు (నకులుడు) వెనక్కి తిరిగి వచ్చి(10), భీముడు మరియు ధర్మరాజుని ఆ సొరంగ మార్గం గుండా పంపి,వారు స్వరంగ మార్గం అవతల వైపుకి రాగానే (35), అటువైపు ఉన్న సహదేవుడు కాగడ ను తీసుకొని మళ్ళీ ఇవతల వైపుకి వచ్చి(40) ,మళ్లీ ఆ సొరంగ మార్గం గుండా అర్జునుడిని అవతలి వైపుకి చేర్చి(50),ఆ తర్వాత మళ్ళీ ఆ కాగడా ని తీసుకొని ఇటువైపు వచ్చి(55) ,నకులుడి ని తీసుకొని అవతలివైపు కు వెళ్ళిపోతే సరిగ్గా 60 నిమిషాల్లో వారు ఆ స్వరంగ మార్గం దాట గలుగుతారు.
































కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?