బేతాళ ప్రశ్న -2 సమయం ఎంత?



చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని విక్రమార్కుడు స్మశానం కేసి నడవ సాగాడు. ఇంతలో శవంలో నుంచి బేతాళుడు బయటకు వచ్చి రాజా నువ్వు  ఇలా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. నీ కష్టాన్ని మర్చిపోవడానికి నేను నీ మెదడుకు పదును  పెట్టే  ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం తెలిసి నువ్వు  చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది. 

మనందరికీ  కౌరవులు, పాండవుల గురించి తెలుసు పాండవులను చంపడానికి కౌరవులు పన్నిన పన్నాగ మే లక్క ఇల్లు. గంటలో దగ్నం అయ్యేలా లక్క ఇంటిని నిర్మించారు.  ఇది తెలుసుకున్న పాండవులు ఆ  లక్క ఇంటిలో ఒక స్వరంగ మార్గం చేసుకొని అక్కడ నుండి బయటపడాలి అనుకున్నారు. ఒకరోజు ముందుగానే తన తల్లిని ఆ సొరంగమార్గం  గుండా అవతలివైపుకు తీసుకువెళ్లారు.

   ప్రస్తుతం ఆ లక్క ఇంటిలో పాండవులు ఐదుగరు మాత్రమే ఉన్నారు. కౌరవుల అనుకున్న సమయం రానే వచ్చింది పాండవులు నిద్రిస్తున్న వేళ  ఆ లక్క ఇంటికి నిప్పంటించారు.ఇది ముందుగానే పసిగట్టిన పాండవులు వేగంగా స్వరంగ మార్గం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడొక చిక్కు ఉన్నది!
     
     ఎన్నో మెలికలు తిరిగిన ఆ స్వరంగ మార్గం లో అక్కడక్కడా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. దారి అస్తవ్యస్తంగా ఉంది.  కాగడ లేకుండా ఆ సొరంగ మార్గంలో ప్రయాణించడం అసంభవం. వారి దగ్గర ఒకటే కాగడా ఉంది. అది గంట సేపు మాత్రమే వెలుగుతుంది.ఇందులో మరొక చిక్కు కూడా ఉంది! ఆ స్వరంగ మార్గం గుండా ఒక సారి ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయగలరు. 


     పాండవుల లో అందరి కంటే చిన్న వారైనా నకుల, సహదేవుల కు ఆ స్వరంగ మార్గం దాటడానికి ఐదు నిమిషాల సమయం పడుతుంది. అలాగే అర్జునుడు దాటడానికి పది నిమిషాల సమయం పడుతుంది .అందరికంటే పెద్దవాడైన ధర్మరాజు దాటడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. స్థూలకాయుడైన   భీముడు వెళ్లడానికి 25 నిమిషాల సమయం పడుతుంది.
   

        ఇప్పుడు ప్రశ్న, లక్క ఇల్లు పూర్తిగా దహనం కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. అలాగే ఆ కాగడ ఆగిపోవడానికి కూడా 60 నిమిషాల   సమయం పడుతుంది.అయితే పాండవులు 60 నిమిషాల్లో ఆ సొరంగ మార్గం గుండా అవతలి వైపు వెళ్లిపోయారు వాళ్ల ఎలా వెళ్లారో చెప్పగలవా?   అని బేతాళుడు విక్రమార్కుడు అడిగాడు.

 దీనికి విక్రమార్కుడు సమాధానం చెప్పే సరికి బేతాళుడు తిరిగి చెట్టుమీదకు  వెళ్లిపోయాడు.

ఈ ప్రశ్నకు విక్రమార్కుడు ఏమని సమాధానం చెప్పి ఉంటాడో తెలిసి మీరు చెప్పకపోతే నీకు ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పోతుంది. ఇదే నా శాపం.


సమాధానం; బేతాళ ప్రశ్న- 1 ఆవులను ఎలాపంచాలి?
రామయ్య దగ్గర ఉన్న 17 ఆవులకు ఇంకొక అవును కలిపితే మొత్తం 18 అవుతాయి.ఆ 18 ఆవులలో మొదటి వాడికి 1/2  వ వంతు అంటే తొమ్మిది ఆవులు ,రెండో వాడికి 1/ 3 వ వంతు అంటే   
6 ఆవులు  ,అలాగే చివరి వాడికి 1/9 వంతు అంటే రెండు ఆవులు ఇస్తే మొత్తం 17 అవుతాయి. మనం ముందుగా కలిపిన ఆవు ని వెనక్కి తీసుకోవడమే
              9+6+2=17 
 



నోట్:- ఈ ప్రశ్నకు సమాధానం తరువాత చెప్పే కథలో చెప్తాను,కానీ మీరు మీ మెదడుకు పని పెట్టి సమాధానం కామెంట్ చేయగలరు















కామెంట్‌లు

Unknown చెప్పారు…
Flicker shock whom it may be a good night friends statis I am also attaching

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?