ఆవులను ఎలా ప‌ంచాలి?

Bethala kathalu

 విక్రమార్కుడు చెట్టుపైకి ఎక్కి చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకోని కాళికామాత గుడి వైపు బయలుదేరాడు. ఇంతలో శవంలో నుంచి బేతాలుడు బయటకు వచ్చి విక్రమార్కుడు తో నేను నీకు ఒక కథ చెబుతాను, ఆ కథలో నుంచి ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి  చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది అని శాపం ఇస్తాడు.



రామాపురం అనే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను పుట్టినప్పుడు నుండి వ్యవసాయం చేస్తూ ఎంతో అభివృద్ధి లోకి వచ్చాడు. అతనికి ముచ్చటగా ముగ్గురు కొడుకులు జన్మించారు. వారిని అతడు ఎంతో ప్రేమతో ,వివేకంతో పెంచసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. రామయ్య ముసలివాడు అయ్యాడు. అతనికి తన చావు సమీపిస్తున్నదని తెలిసి తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు పంచాలని నిర్ణయించుకున్నాడు.

రామయ్య దగ్గర ఉన్న పొలము, ఇల్లు, డబ్బు ,బంగారం తన ముగ్గురు కొడుకులలో చిన్న కొడుకు ఎక్కువగానూ ,రెండవ కొడుకుకు చిన్న కొడుకు కంటే కొంచెం తక్కువగాను ,అలాగే మొదటి కొడుకుకి మిగిలిన ఇద్దరు కంటే తక్కువగా ఆస్తిని పచాడు.కానీ తన దగ్గర ఉన్న ఆవుల మాత్రం పంచలేదు. అనుకోకుండా ఒక రోజు రామయ్య చనిపోయాడు.తన ముగ్గురు కొడుకులు అతనికి దహన సంస్కారం చేసి వారి బాధ్యత తీర్చుకున్నారు.కానీ వారీ దగ్గర ఉన్న ఆవుల మాత్రం వారు ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత రామయ్య రాసిన పత్రం ఒకటి కనబడింది.అందులో  ముగ్గురు కొడుకులకు ఆవులను ఎలా పంచాలో రాసి ఉంది.


ఆ పత్రంలో ఇలా రాసి ఉంది "రామయ్య అనే నేను నా దగ్గర ఉన్న ఆవులను నా ముగ్గురు కొడుకులకు ఈ విదంగా పంచాలి అనుకుంటున్నాను. పెద్దవాడికి నా మొత్తం ఆవుల లో 1 / 2 వ వంతు ,రెండవ వానికి నా మొత్తం ఆవుల లో 1/3  వ వంతు అలాగే చివరి వాడికి నా మొత్తం ఆవుల లో 1/9  వ వంతు. ఈ పత్రం చూసిన తర్వాత తన ముగ్గురు కొడుకులు ఆవులను తన తండ్రి వ్రాసిన పత్రం లోని విధంగానే పంచుకోవాలి అనుకున్నారు. కానీ రామయ్య దగ్గర 17 ఆవులు మాత్రమే ఉన్నాయి.వారు ఆవులను ఎలా పెద్దవాడికి పంచాలో అర్థం కాక ఆ రాజ్యం పాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్ళారు.


అదే రాజు నువ్వైతే రామయ్య కొడుకులకి రామయ్య కోరిన విధంగానే ఆవులను ఎలా పంచుతావు. దీనికి సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది అని గుర్తు చేస్తారు.


 హాయ్ ఫ్రెండ్స్ కథ విన్నారు కదా ఈ కథలో రాజ మీరు అయితే మీరు ఏ విధంగా రామయ్య కొడుకులకు ఆవులను రామయ్య కోరిన విధంగానే పంచుతారు సమాధానం తెలిసీ చెప్పకపోతే మీకు ఆదివారం కూడా బడి ఉంటుంది. 


మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి అలాగే సరైన సమాధానం  తర్వాత కథలో నేను మీకు చెప్తాను.




















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?