ఏ ప్రశ్న అడగాలి? బేతాళ ప్రశ్న?-4.


విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవంలో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో!

కాశీ పురం  రాజ్యాన్ని ప్రదీపుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు.  రాజు ఓడప్రయాణంలో ఇతర దేశాలను సందర్శిస్తూన్నాడు  తనతోపాటు సుబుద్ధి అనే మంత్రి, రాజు  కూతురు పద్మావతి ఉన్నారు. వారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా రెండు దీవులు కనిపించాయి ఆ దీవుల గురించి మంత్రి ఇలా చెప్పసాగాడు వాటిలో ఒకటి సత్య దీవి, ఇంకొకటి అసత్యదీవి. సత్యదీవి లోని వారంతా సత్యమే మాట్లాడతారు, అలాగే అసత్యదీవి లోని వారంతా అసత్యమే మాట్లాడతారని రాజుకి మంత్రి అర్థమయ్యేలా చెప్పాడు. ఇంతలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు,వచ్చిన వారిలో ఒకరు ఒక ఒక దీవి నుంచి మిగిలిన ఇద్దరు ఇంకో దీవి నుంచి వచ్చిన వారు, వారు వారి దగ్గర ఉన్న గవ్వలను,ముత్యాలను అమ్మడానికి వచ్చారు. వచ్చిన ముగ్గురిని రాజు ఇలా ప్రశ్నించాడు మీరు ఏ దీవి నుంచి వచ్చారు? ఈ ప్రశ్న విని మంత్రి నవ్వుతూ రాజా మీరడిగిన ప్రశ్నకు వారి ముగ్గురు ఒకే సమాధానం చెప్తారు, అదే సత్యదీవి నుండి  వచ్చామని. ఇది అర్థం కావడానికి రాజుకి కొంచెం సమయం పట్టింది.( స్నేహితులారా మీకు అర్థమైందా అర్ధమైతే కామెంట్ రూపంలో తెలపండి) ఆ గవ్వలను ముత్యాలను పరిశీలిస్తున్న యువరాణి ఆ ముగ్గురిలో ఒకరిని మిగిలిన ఇద్దరూ ఒకే దీని నుంచి వచ్చారా? అని అడిగింది దానికి ఆ వ్యక్తి అవును అని సమాధానం ఇచ్చాడు, అలాగే రెండో వ్యక్తిని కూడా  అదే ప్రశ్న అడిగిన దానికి రెండో వ్యక్తి కూడా అవును అని సమాధానం చెప్పాడు ఇదే ప్రశ్న మూడో వ్యక్తిని అడుగుతుంటే మంత్రి  అతను కూడా అదే సమాధానం ఇస్తాడు అని చెప్పాడు. 

          అతను కూడా ఎందుకు అదే సమాధానం   ఇస్తాడో యువరాణికి అర్థం కాలేదు. యువరాణి ఎందుకు అదే సమాధానం ఇస్తాడు అని మంత్రిని అడగగా, మంత్రి యువరాణికి అర్థం అయ్యేలా వివరిస్తాడు.(స్నేహితులారా మంత్రి యువరాణికి ఏమని వివరిస్తాడో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి). వారుఇలా ప్రయాణం చేస్తూ ఉండగా పక్కనే ఉన్న అవంతిపురం రాజ్యానికి చేరుకున్నారు, అక్కడకి దగ్గరలో ఉన్న ఒక భవంతిలో  బస చేశారు. అవంతిపురం యువరాజు వారి రాజ్యంలో ఎవరో కొత్త రాజు ప్రవేశించారు అని తెలుసుకుని  వారిని పలకరించడానికి  అక్కడకి వెళ్తుండగా యువరాజుకి పద్మావతి కనిపించింది ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు. ఆమె కూడా యువరాజుని చూసి ప్రేమలో పడిపోయింది. వారిద్దరూ తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత యువరాజు ప్రతీపుడు దగ్గరికి వెళ్లి ఆయనను తన రాజ్యానికి ఆహ్వానించి రాత్రి విందు భోజనానికి ఇక్కడే ఉంటానని చెప్పాడు, దానికి ప్రతీపుడు ఎంతో సంతోషపడ్డాడు, దీనితోపాటు యువరాజు తనకు పద్మావతి అంటే చాలా ఇష్టం అని ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇది విన్న రాజుకి ఎంతో కోపం వస్తుంది కానీ వారు ఇప్పుడు అవంతిపురం లో ఉన్నారని మంత్రి చెప్పగా రాజు కొంచెం కోపం తగ్గించుకొని మీకు మా కూతురు కావాలంటే నేను ఒక పరీక్ష పెడతాను.దానిలో మీరు నెగ్గితే మీకు నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతే నీకు మరణదండన తప్పదు అని  చెప్తాడు. దీనికి యువరాజు సరేనని బదులిస్తాడు. వెంటనే రాజు మంత్రిని పిలిచి యువరాజుకి అది కష్టమైన ప్రశ్నను తయారు చేయమని చెప్పాడు. సుబుద్ధి కొంచెం సేపు ఆలోచించి తనకు ఒక ఆలోచన వచ్చిందని రాజుకి వివరిస్తాడు, రాజు ఎంతో సంతోషించి ఇదే సమస్యగా అడుగుదామని చెప్తాడు. రాజు మంత్రి కి సైగ చేసి ఈ సమస్య గురించి యువరాజుకి వివరించండి అని చెప్తాడు.  

 మంత్రి యువరాజుకి ఈ విధంగా వివరిస్తాడు రేపు నీ ముందు రెండు ద్వారాలు ఉంటాయి. ఒక దానిలో యువరాణి పూలమాలతో ఎదురుచూస్తుంది, ఇంకొక దానిలో కత్తి. నీవు యువరాణి ఉన్న ద్వారాన్ని తెరిస్తే యువరాణి తో వివాహం  అవుతుంది, కానీ నువ్వు కత్తి ఉన్న ద్వారాన్ని తెలిస్తే ఆ కత్తితోనే నీకు మరణదండన లభిస్తుంది. అలాగే ఆ రెండు ద్వారాల ముందు ఇద్దరు ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారిలో ఒకరు సత్య దీవి నుంచి వచ్చిన వారు, రెండోవారు అసత్య దీవి నుంచి వచ్చిన వారు. వారికి ఆ గదులలో ఏమి ఉన్నాయో తెలుసు,  ఏదో  ఒక ద్వారం ముందు ఉన్న  ఆ ఇద్దరూ ద్వారపాలకులో ఎవరో ఒకరిని ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం నీకు ఇస్తాము. నీవు ఆ ఒక్క ప్రశ్న అడిగి యువరాణి ఏ ద్వారం వెనకాల ఉందో తెలుసుకొని యువరాణిని, నీ ప్రాణాలని దక్కించుకో అని చెప్తాడు. దీనికి సరేనని చెప్పి యువరాజు తనకు కేటాయించిన గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. 

 

   స్నేహితులారా కథను విన్నారు కదా! అదే యువరాజు స్థానంలో మీరు ఉంటే, ఇదే సమస్య మీకు  ఎదురైతే మీరు ఆ ద్వారపాలకులు ఏ ప్రశ్న అడుగుతారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సమాధానం తెలిసి మీరు చెప్పకపోతే మీరు ఎంత తిన్నా మీ ఆకలి తీరదు.


  సమాధానం: ఎవరిని పెళ్లి చేసుకోవాలి?  (బేతాళ ప్రశ్న 3)

             ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు లో మూడో వ్యక్తిని (వీరుడి) పెళ్లి చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే భర్త ఇప్పుడు తన భార్యను ఎటువంటి ప్రమాదంలోనుంచైనా కాపాడుకో కలిగిన వాడై ఉండాలి. మొదటి వ్యక్తి ఎక్కడ ఉందో కనిపెట్టాడే కానీ అతను కి ఆమెను విడిపించేంత శక్తి లేదు. అతను కనిపెట్టినా అతను ఏం చేయలేడు. అలాగే రెండో వ్యక్తి ఆమె దగ్గరికి త్వరగా చేర్చగలిగాడు అంతేకానీ ఆమెను  కాపాడలేడు. కానీ మూడో వ్యక్తి తన ఎక్కడ ఉందో తెలిసిన తెలియకపోయినా,అలాగే తన దగ్గరికి వేగంగా వెళ్ళిన నిదానంగా వెళ్లినా, అతను ఎప్పటికైనా ఆమెను కనిపెట్టి ఆ రాక్షసుని చంపి ఆమెను రక్షించగలిగిన వాడు. ఆ రాక్షసుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడం అంత కష్టమైన పని కాదు! ఎందుకంటే అతని గురించి అతను వెళ్ళిన దిక్కులో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది వారిని అడిగి అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడం వీరుడికి అంత కష్టమైన పనేం కాదు! అలాగే అతని దగ్గరికి చేరుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం వీరుడికి మంచిదే, ఎందుకంటే అతని గురించి అతని శక్తుల గురించి తెలుసుకుని అతడిని ఇంకా వేగంగా ఓడించగలిగేవాడు. ఇక రాక్షసుడు ఎత్తుకు వెళ్ళిన అమ్మాయిని చంపాలనుకుంటే, అతడు చూసిన మరుక్షణమే  ధనికుడి  ఇంట్లోనే చంపే వాడు కానీ అలా చేయలేదు ఎందుకంటే ఆమె ఎంతో అందమైన యువతి ఆమెను పెళ్లి చేసుకుందామని కోరికతోనే ఆ రాక్షసులు తీసుకుపోయి ఉంటాడు అందుకని ఆమెకు ఎటువంటి హాని కలిగించడు.


   పరీక్షలు ఉన్నందువలన కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి.✋👯





















కామెంట్‌లు

Riddle king చెప్పారు…
సమాధానం:- 1. మంత్రి ఎందుకు ముగ్గురు ఒకే సమాధానం చెప్తారు అని చెప్పాడు, అది సత్యదీవి నుంచి వచ్చామని. వివరణ-ఉదాహరణకి ఆ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరూ అసత్యదీవి నుంచి వచ్చారు అనుకున్నాం! వారిని రాజు గారు మీరు ఏ దీవి నుంచి వచ్చారు అని అడిగితే వారు అబద్ధమే చెప్పాలి కనుక సత్యదీవి నుంచి వచ్చామని చెప్పారు. అలాగే సత్యదీవి నుంచి వచ్చినవారు సత్యమే చెప్పాలి కనుక వారు సత్యదీవి నుంచి వచ్చామని చెప్పారు.
Riddle king చెప్పారు…
2. ఆ ముగ్గురు వ్యక్తులను యువరాణి మిగిలిన ఇద్దరూ ఒకే దీవి నుంచి వచ్చారా అని అడిగితే అవును అని సమాధానం మొదటి ఇద్దరు చెప్పారు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు అసత్య దీవి నుంచి వచ్చారు అనుకుంటే! ఇప్పుడ యువరాణి అడిగిన ప్రశ్నకు అసత్య దీవి నుంచి వచ్చినవారు అబద్ధమే చెబుతారు, కనుక అవునని. అలాగే సత్య దీవి నుంచి వచ్చినవారు సత్యమే చెప్పాలి. ఇద్దరు ఓకే దేవి నుంచి వచ్చారు అని చెబుతాడు. దీనినిబట్టి మనకు వచ్చిన ముగ్గురిలో ఇద్దరు అసత్య దీవి నుంచి వచ్చినవారు, అలాగే ఒకరు సత్య దీవి నుంచి వచ్చినవారు అని అర్థమవుతుంది. అదే ఆ వచ్చిన ముగ్గురిలో ఇద్దరూ సత్య దీవి నుంచి వచ్చిన వారు అయితే వారు అయితే ఖచ్చితంగా నిజమే చెప్పాలి కనుక యువరాణి అడిగిన ప్రశ్నకు కాదు అని సమాధానం చెప్తారు. మీకు ఈ వివరణ అర్థమైందా! అర్థం కాకపోతే మళ్లీ అడగండి చెబుతాను.
Riddle king చెప్పారు…
3. ఆ ప్రశ్న ఏమిటంటే "ఈ ద్వారం వెనకాల యువరాణి ఉందా అని అడిగితే రెండో వ్యక్తి ఏమని సమాధానం చెబుతాడో అని మొదటి వ్యక్తిని అడగాలి".
వివరణ-మనకి ద్వారం ముందు ఎవరు సత్య దీవి నుంచి వచ్చారో ఎవరు అసత్య దీవి నుంచి వచ్చారో తెలియదు. కనుక మనం ముందుగా ఒక ద్వారం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న యిద్దరు ద్వారపాలకులలో ఎవరో ఒకరిని ఈ ప్రశ్న అడిగితే
*ప్రశ్న అడిగింది సత్య దీవివాడినైతే, రెండో వ్యక్తి అసత్య దీవి వాడవుతాడు. అసత్య దీవి వాడు యువరాణి ఉంటే లేదు అని, యువరాణి లేకపోతే ఉంది అని సమాధానం చెబుతాడు. దీనినే సత్య దీవి వాడు యువరాణి ఉంటే లేదు అని, యువరాణి లేకపోతే ఉంది అని రెండో వ్యక్తి చెబుతాడు అని మనకు చెబుతాడు.
*ప్రశ్న అడిగింది అసత్య దీవి వాడినైతే, రెండో వ్యక్తి సత్య దీవి వాడు అవుతాడు. సత్య దీవి వాడు యువరాణి ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని సమాధానం చెప్తాడు. దీనిని అసత్య దీవి వాడు మనకి అబద్ధం చెప్పాలి కనుక యువరాణి ఉంటే లేదు అని యువరాణి లేకపోతే ఉంది అని రెండో వ్యక్తి చెబుతాడు అని మనకి చెబుతాడు.

ఇలా మనం రెండు ద్వారాల ముందు ఉన్న ఇద్దరూ ఇద్దరూ ద్వారపాలకులో ఎవరో ఒక్కొక్కరిని ఈ ప్రశ్న అడిగితే ఒక ద్వారం ముందున్న ద్వారపాలకుడు లేదు అని ఇంకో ద్వారం
ముందున్న ద్వారా పాలకుడు ఉంది అని సమాధానం చెబుతారు. లేదు అని సమాధానం ఏ ద్వారం ముందున్న ద్వారపాలకుడు చెబుతాడో ఆ ద్వారం వెనకాల యువరాణి ఉంటుంది.



ఎందుకు అందరూ సమాధానం చెప్పలేక పోతున్నారో తెలియట్లేదు. నేను ఏమైనా కష్టమైన ప్రశ్నలు అడుగుతుంటే చెప్పగలరు. మీరు చెబితే నేను ఇంకొంచెం సులభమైన ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తాను.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Learn about Solenoid

ఎవరివల్ల ఇలా జరిగింది? బేతాళ ప్రశ్న 5?